Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ

Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ

వార్త 4 months ago

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నుంచి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది.

ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరు

అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఇప్పటివరకు రిజిస్టర్లో సంతకాల ద్వారా హాజరు నమోదు చేసే పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. నూతన ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరును మరింత కచ్చితంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు. పెద్ద కార్పొరేట్ సంస్థల సీఈఓలు సైతం బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారని, పార్లమెంట్లోనూ ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha