Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగన్వాడీల పేరుతో వైసీపీ విషప్రచారం.. 'ఫేక్ వర్సెస్ రియల్' వీడియోతో లోకేశ్ కౌంటర్!

అంగన్వాడీల పేరుతో వైసీపీ విషప్రచారం.. 'ఫేక్ వర్సెస్ రియల్' వీడియోతో లోకేశ్ కౌంటర్!

వార్త 1 week ago

Nara Lokesh: అంగన్వాడీల విషయంలో ప్రతిపక్ష వైసీపీ వికృత ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇటీవల పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు తనకు ధన్యవాదాలు తెలిపేందుకు నిర్వహించిన సంతోషకరమైన కృతజ్ఞతా ర్యాలీని, వైసీపీ నాయకులు తప్పుడు కోణంలో ‘నిరసన’గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ‘ఫేక్ వర్సెస్ రియల్’ వీడియోను విడుదల చేశారు.

Read Also : Petrol price today: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఇంధన రేట్లు

Nara Lokesh: వైసీపీ హయాంలో ద్రోహం.. కూటమి ప్రభుత్వంలో ‘తల్లికి వందనం’

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘అమ్మఒడి’ పథకాన్ని వర్తింపజేయకుండా తీవ్ర ద్రోహం చేశారని నారా లోకేశ్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం చేసిన ఈ మంచి మేలుకు సంతోషించిన అంగన్వాడీలు స్వచ్ఛందంగా వచ్చి తనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు, ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకనే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయం చేస్తూ విషప్రచారానికి ఒడిగడుతోందని లోకేశ్ దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా అసలైన చిత్రాలు, వైసీపీ మార్ఫింగ్ చేసిన ఫోటోలను పంచుకున్న ఆయన.. విపక్షాల ‘ఫేక్ న్యూస్’ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha