Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నామలై నిష్క్రమణతో పార్టీకి నష్టం లేదు: తమిళనాడు బీజేపీ

అన్నామలై నిష్క్రమణతో పార్టీకి నష్టం లేదు: తమిళనాడు బీజేపీ

వార్త 2 months ago

Annamalai's departure: తమిళనాడు బీజేపీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అన్నామలై ప్రకటించారు.

అన్నామలై రాజీనామాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. ఈ పరిణామంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు.

Read Also: Mamata Banerjee : మమత చూపు పార్లమెంట్‌వైపు !

Annamalai’s departure

Annamalai’s departure: వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం

అన్నామలై రాజీనామా వల్ల పార్టీకి ఎలాంటి నష్టంలేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరి, 2025 ఏప్రిల్ వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నాగేంద్రన్ నియమితులయ్యారు. “బీజేపీ సభ్యుడిగా, ఒక తమిళుడిగా నా గుర్తింపునకు మధ్య అంతర్గత సంఘర్షణ నెలకొంది. అందుకే నేడు ఒక నూతన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. మా రాజకీయ పార్టీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది” అని అన్నామలై స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com

Read Also:

మాల్దా ఎన్నికల ముందు ఎస్ఐఆర్ సంబంధిత హింసా కేసులో ఇద్దరు అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha