Annamalai : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీని వీడిన అనంతరం సామాజిక మార్పు కోసం 'వి ది లీడర్స్' (We The Leaders) అనే నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
అయితే, ఈ సరికొత్త ప్రయత్నంపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తీవ్రస్థాయిలో సెటైర్లు వేసింది. ఈ ఉద్యమం ఒక పాత సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేసిన (రీరిలీజ్) చందంగానే ఉందంటూ TVK కీలక నేత, మంత్రి కేజీ అరుణ్ రాజ్ ఎద్దేవా చేశారు. ప్రేక్షకులు ప్రతి రీరిలీజ్ సినిమాను ఆదరించరని, రాజకీయాల్లో అన్నామలై ప్రస్తుత పరిస్థితి ఏంటో ఆయనకు కూడా బాగా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. అన్నామలై ప్రజాదరణను తగ్గించి చూపేలా అధికార పక్షం చేసిన ఈ విమర్శలు ఇప్పుడు ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
Read Also : భారత కుబేరుల రేసులో అదానీ దూకుడు: కేవలం 155 రోజుల్లోనే సంపద భారీగా పెంపు

విమర్శలకు ధీటుగా రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు
ఒకవైపు TVK నాయకత్వం ఈ ఉద్యమాన్ని పాత చింతకాయ పచ్చడిలా కొట్టిపారేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అన్నామలై వ్యూహానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ‘వి ది లీడర్స్’ ఉద్యమం ప్రారంభించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే 14 లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో సభ్యులుగా నమోదు చేసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ భారీ స్పందన అన్నామలైకున్న వ్యక్తిగత క్రేజ్, ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యర్థులు ఎంతగా సెటైర్లు వేసినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వ్యక్తమవుతున్న ఈ ప్రజాదరణే అన్నామలైకి శ్రీరామరక్ష అని, రాబోయే రోజుల్లో ఇది తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
21 మంది మృతి చెందిన ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్

