Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నదాన కార్యక్రమంలో విషాదం.. సాంబారు పాత్రలో పడి మహిళ మృతి

అన్నదాన కార్యక్రమంలో విషాదం.. సాంబారు పాత్రలో పడి మహిళ మృతి

వార్త 1 week ago

Sambar Pot Accident: విజయవాడలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులు చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు మరిగే సాంబారు పాత్రలో పడిపోయి మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Read Also :Madhapur Crime : మాదాపూర్ ఓయో హోటల్‌లో విషాదం - యువతి మృతి, ప్రియుడు జంప్

వంట చేస్తుండగా ప్రమాదం

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుజాత (46) వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయంగా ఉన్నారు. ఈ క్రమంలో పొయ్యిపై ఉంచిన పెద్ద సాంబారు పాత్రను కిందకు దించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఆమె అదుపుతప్పి ప్రమాదవశాత్తు పాత్రలో పడిపోయినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న తోటి వంట సిబ్బంది, నిర్వాహకులు సుజాతను బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో చివరకు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Sambar Pot Accident: వైరల్‌గా సీసీటీవీ దృశ్యాలు

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్సవాల సమయంలో జరిగిన ఈ ప్రమాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha