Dailyhunt
Annamayya District: రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

Annamayya District: రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

వార్త 3 months ago
  • అఖిల రాఖీలపక్ష కమిటీ నేతల ప్రతిన
  • రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డి కుమార్
  • 14 మండలాల కేంద్రంగా రాయచోటి జిల్లా కావాల్సిందే

రాయచోటి 7 జనవరి 2026 అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దుచేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలని రిటైర్డ్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రెడ్డి కుమార్ అన్నారు. రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బుధవారం మేజిస్ట్రేట్ రెడ్డి కుమార్ పాల్గొని జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

Read also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక

The fight will continue until Rayachoti district is achieved

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని మార్చే ప్రసక్తి లేదని గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మకాన్ని పెంచుకొని వివిధ రకాల పెట్టుబడులు రాయచోటి కేంద్రంలో పెట్టుకున్నారని దీనితో అన్ని రంగాల ప్రజలు చుట్టుపక్కల మండలాల వాసులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఏర్పడిందని ప్రభుత్వం చేసిన ఈ తప్పును సరిదిద్దుకోడానికి రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాల్సిందేనని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

అనంతరం రిటైర్డ్ ఎంఈఓ మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలు పాటు కొనసాగిన జిల్లా కేంద్రాన్ని పెద్దచేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని మదనపల్లె జిల్లా చేయడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే రాయచోటి ప్రత్యేక జిల్లా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక వెనుకబాటుతనం రాయచోటి కేంద్రంగా ఉన్న 14 మండలాలలో ఉందని రాయచోటి జిల్లా కేంద్రం చేసి ఈ మండలాలు అన్నిటిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Keshineni Chinni: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha