Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి.. విజయ్ పాత ఇంటర్వ్యూ

అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి.. విజయ్ పాత ఇంటర్వ్యూ

వార్త 1 week ago

Tamil Nadu: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని సంచలన నిర్ణయాలతో ప్రారంభించారు. మే 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, పరిపాలనలో తన మొదటి అడుగుతోనే రాజకీయ దుమారాన్ని రేపారు.

Read Also : Bengal Violence: బెంగాల్ హింస కేసులో స్వయంగా రంగంలోకి దిగిన దీదీ!

 tamil nadu cm vijay osd appointment controversy old interview viral

Tamil Nadu: వివాదానికి కారణమైన ఓఎస్డీ నియామకం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే విజయ్ తన వ్యక్తిగత జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వేత్రివేల్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా నియమించారు. ఒక ప్రభుత్వ ఉన్నత పదవిలో జ్యోతిషుడిని కూర్చోబెట్టడంపై విపక్షాల నుండి, హేతువాద సంఘాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. సైద్ధాంతికంగా ద్రవిడ రాజకీయాలు హేతువాదానికి ప్రాధాన్యత ఇస్తాయని, అలాంటి చోట జ్యోతిషుడికి పదవి ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. అయితే, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కేవలం 24 గంటల్లోనే ఈ నియామకాన్ని రద్దు చేస్తూ యూటర్న్ తీసుకుంది.

వైరల్ అవుతున్న విజయ్ పాత ఇంటర్వ్యూ

ఈ వివాదం నడుస్తుండగానే, విజయ్ గతంలో తన మత విశ్వాసాల గురించి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బీస్ట్’ సినిమా సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి హిందువు, తండ్రి క్రిస్టియన్ అని.. తనపై ఎప్పుడూ ఏ మతాన్ని రుద్దలేదని ఆయన తెలిపారు. తన పిల్లలకు కూడా అదే స్వేచ్ఛను ఇస్తానని చెప్పారు. తాను ప్రగాఢ దైవభక్తుడినని పేర్కొంటూ.. చర్చిలకు వెళ్లడంతో పాటు పిల్లార్‌పట్టి వినాయక ఆలయం, తిరునల్లార్ ఆలయాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. 2014లో ‘కత్తి’ సినిమా షూటింగ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చర్చి, ఆలయం, దర్గా.. ఎక్కడికి వెళ్లినా తనకు ఒకే రకమైన దైవిక అనుభూతి కలుగుతుందని ఆ ఇంటర్వ్యూలో విజయ్ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha