సరిగ్గా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరగడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'ఎన్నికలు అయిపోగానే ధరలు పెరుగుతాయని' గతంలో ప్రతిపక్షాలు చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు.
ఓట్ల వేటలో ఉన్నప్పుడు సామాన్యుడికి ఊరటనిచ్చేలా ధరలను నియంత్రించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు సడన్‌గా భారం వేయడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది.
Read Also : కేరళం కొత్త సీఎం ఆస్తులు వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

అంతర్జాతీయ ఉద్రిక్తతలు – ముడిచమురు సెగ
పెట్రో ధరల పెంపుకు ప్రధాన కారణం పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న యుద్ధ మేఘాలేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు బ్యారెల్‌కు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై (OMCs) భారీ ఆర్థిక భారం పడింది. గత కొన్ని నెలలుగా నష్టాలను భరిస్తూ వచ్చిన కంపెనీలు, ఇప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
రవాణా రంగంపై ప్రభావం – పెరగనున్న నిత్యావసరాలు
ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా, గొలుసుకట్టు చర్యలా అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. డీజిల్ ధర పెరగడంతో లారీలు, ఇతర రవాణా వాహనాల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది నేరుగా కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి, ఈ పెట్రో బాదుడు “గోరుచుట్టుపై రోకలిపోటు”లా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకుని పన్నుల తగ్గింపు ద్వారా ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

