Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

వార్త 4 months ago

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం ఒక పెద్ద కుదుపుకు లోనవుతోంది. కేవలం గత 8 ట్రేడింగ్ సెషన్లలోనే ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.

6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 19% మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్స్ (IT Stocks) నుండి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? భయపెడుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఐటీ రంగంలో పతనానికి ప్రధాన కారణం ఏఐలో వస్తున్న పెను మార్పులు. 'అంత్రోపిక్' (Anthropic) అనే సంస్థ విడుదల చేసిన 'క్లాడ్ 4.6' (Claude 4.6) , 'కోవర్క్' (Cowork) వంటి ఏఐ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ ను అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తున్నాయి. Also Read TCS ని కుదిపేస్తున్న AI భయం.. కుప్పకూలిన మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు దిగువకు.. మారిన లెక్కలు: గతంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 100 మంది అవసరమైతే.. ఇప్పుడు ఏఐ సాయంతో కేవలం 10-20 మందితోనే ఆ పని పూర్తవుతోంది.

ఇప్పుడు క్లయింట్లు పని ఎంత త్వరగా పూర్తయింది

బిజినెస్ మోడల్ మార్పు: భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 'ఎంత మంది పని చేస్తున్నారు' (Headcount) అనే దానిపై ఆదాయం పొందేవి. కానీ ఇప్పుడు క్లయింట్లు 'పని ఎంత త్వరగా పూర్తయింది' (Outcome based pricing) అనే దానిపైనే డబ్బులిస్తామని చెబుతున్నారు. దీనినే మార్కెట్ నిపుణులు 'SaaSpocalypse' అని పిలుస్తున్నారు. అగ్రశ్రేణి కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఈ అమ్మకాల సునామీలో ఏ కంపెనీ కూడా తప్పించుకోలేకపోయింది. గత 8 రోజుల్లో వివిధ కంపెనీల షేర్ల పతనం ఇలా ఉంది.. ఇన్ఫోసిస్ (Infosys): 21% పతనం టీసీఎస్ (TCS): 19% పతనం (దీని మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్ల కంటే కిందకు పడిపోయింది) హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech): 17% పతనం విప్రో, టెక్ మహీంద్రా: 13% పతనం దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే వార్తలు కూడా ఐటీ షేర్లపై ఒత్తిడిని పెంచాయి. ఇది ముగింపా లేక కొత్త ఆరంభమా? చాలా మంది ఇన్వెస్టర్లు ఐటీ రంగం పని అయిపోయిందని భయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha