Pune Acid Attack: మహారాష్ట్రలోని పూణేలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా అత్యంత అమానుషంగా గుప్తభాగాలపై యాసిడ్ పోసి దాడికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని 15 రోజుల పాటు ఇంట్లోనే బంధించి నరకయాతనకు గురిచేశాడు.
Read Also :UP Road Accident: వ్యాన్, ట్రక్కు ఢీకొని 10 మంది మృతి!

అనుమానం, కొడుకు పుట్టలేదనే కోపంతో అమానుషం
పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 20వ తేదీన నిందితుడు మద్యం మత్తులో తీవ్ర కోపంతో ఇంటికి వచ్చాడు. తమకు కొడుకు పుట్టలేదనే అసంతృప్తితో పాటు, భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో గొడవకు దిగాడు. “నువ్వు పనికి బయటకు వెళ్లినప్పుడు ఎవరితో తిరుగుతున్నావో చెప్పు” అంటూ భార్యను దారుణంగా కొట్టడం ప్రారంభించాడు.
ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఆమెను చంపేస్తానని బెదిరిస్తూ, ఇంట్లో టాయిలెట్ క్లీనింగ్ కోసం ఉపయోగించే యాసిడ్ బాటిల్‌ను తీసుకుని ఆమె గుప్తభాగాలపై పోశాడు. యాసిడ్ పడటంతో బాధితురాలు తట్టుకోలేని నొప్పితో కేకలు వేస్తూ, ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించింది. అయితే, నిందితుడు తలుపులు లోపలి నుండి లాక్ చేసి, ఆమెను కిందపడేసి కాళ్లతో తొక్కుతూ, గుద్దుతూ మరింతగా హింసించాడు.
Pune Acid Attack: బెదిరింపులకు పాల్పడిన నిందితుడు
బాధితురాలి అరుపులు విన్న ఆమె ఆడపడుచు (భర్త సోదరి) అక్కడికి చేరుకుని, నిందితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో నిందితుడు భార్యను ఉద్దేశించి.. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని తీవ్రంగా బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే రోజు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాడు.
15 రోజుల నరకయాతన.. ఆపై పుట్టింటికి చేరిన బాధితురాలు
తీవ్రమైన యాసిడ్ గాయాల వల్ల కలిగిన నరకయాతనను అనుభవిస్తూ, ఎలాంటి వైద్యం అందకుండానే ఆ మహిళ 15 రోజుల పాటు ఆ ఇంట్లోనే బంధీగా ఉండిపోయింది. మే 9న భర్త పనికి వెళ్లిన సమయాన్ని చూసుకుని, ఆమె తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఎలాగోలా తప్పించుకుని తన పుట్టింటికి చేరుకుంది. పుట్టింటికి వెళ్లాక భర్త చేసిన క్రూరమైన హింసను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కేసు నమోదు - ఆసుపత్రిలో చికిత్స
మే 15న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉరులి కాంచన్ పోలీస్ స్టేషన్ అధికారులు నిందితుడైన భర్తపై కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం పూణేలోని ప్రసిద్ధ సాసూన్ ఆసుపత్రి (Sassoon Hospital) కి తరలించారు. ఈ ఘటనపై ఉరులి కాంచన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాంగడే స్పందిస్తూ.. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు మరియు చట్టపరమైన చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో దారుణం.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

