Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అణ్వాయుధం విషయంలో ఇరాన్‌కు ఛాన్స్ లేదు: ట్రంప్

అణ్వాయుధం విషయంలో ఇరాన్‌కు ఛాన్స్ లేదు: ట్రంప్

వార్త 1 week ago

Donald Trump: ఇరాన్ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సొంతం చేసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చిచెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన 'స్టీల్ అక్రాస్ అమెరికా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ అణ్వస్త్ర తయారీకి చేరువైనప్పటికీ తాము తీసుకున్న కఠిన చర్యల వల్ల ఆ అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.

శక్తిమంతమైన ఆంక్షలతో ఇరాన్‌ కట్టడి

ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆంక్షలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని ట్రంప్ కొనియాడారు. అమెరికా సైన్యం చేపట్టిన చర్యల వల్లే ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలు పూర్తిగా అడ్డుకోగలిగామని, ఈ స్థాయిలో విజయం సాధించడం ఊహించని పరిణామమని ఆయన సైన్యాన్ని ప్రశంసించారు.

9/11 ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవ స్మరణ

సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 3 వేల మంది అమాయకులను ట్రంప్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ శిథిలాల నుంచి సేకరించిన 16,000 పౌండ్ల భారీ ఉక్కు దూలాన్ని ప్రదర్శించారు.

ఫైర్‌ఫైటర్ జెఫ్రీ పలాజోకు అరుదైన గౌరవం

ఉగ్రదాడుల సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడి, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఫైర్‌ఫైటర్ జెఫ్రీ పలాజో సేవలను ట్రంప్ స్మరించుకున్నారు. ఆయన త్యాగానికి గుర్తింపుగా కోస్ట్ గార్డ్‌కు చెందిన సరికొత్త నౌకకు జెఫ్రీ పలాజో పేరు పెట్టనున్నట్లు ఈ వేదికపై ఆయన అధికారికంగా ప్రకటించారు.

‘ది మ్యాన్ ఇన్ ది రెడ్ బందానా’కు అత్యున్నత పురస్కారం

ఇదే కార్యక్రమంలో 9/11 దాడుల సమయంలో అనేక ప్రాణాలు కాపాడి హీరోగా నిలిచిన వెల్లెస్ క్రౌథర్‌ను ‘ది మ్యాన్ ఇన్ ది రెడ్ బందానా’గా స్మరించుకున్నారు. ఆయన చేసిన సాహసానికి గుర్తింపుగా మరణానంతరం అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను అందజేశారు. ఈ అవార్డును ఆయన తరఫున తల్లి అలీసన్ క్రౌథర్ స్వీకరించారు.

బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ - పుతిన్ భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha