Dailyhunt
AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

వార్త 1 month ago

AP Crime: ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నవరం గ్రామంలో ఓ మహిళపై యాసిడ్ దాడికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తనకు వరసకు మరిది అయ్యే శామ్యూల్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించింది. దీనికి మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.

Madanapalle Case: నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

దర్యాప్తు ప్రారంభం

దీంతో మహిళపై యాసిడ్‌తో దాడి చేసేందుకు యత్నించాడు శామ్యూల్. బంధువుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణహాని ఉందంటూ రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

TG Crime: పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha