Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

వార్త 4 months ago

(AP) ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈనెల 10న కేసు నమోదు చేసింది సీఐడీ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను సిట్ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబుకు అప్పగించింది. సుమారు రూ.200 నుంచి రూ.400 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం.

మరోవైపు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. (AP) ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దర్యాప్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha