Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
APPSC గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నవంబర్ 9 వరకు గడువు పొడిగింపు!

APPSC గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నవంబర్ 9 వరకు గడువు పొడిగింపు!

వార్త 3 weeks ago

APPSC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ఊరటనిచ్చింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన విజ్ఞప్తుల మేరకు గ్రూప్-1తో పాటు పలు నియామక పరీక్షల దరఖాస్తు గడువును నవంబర్ 9 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఇప్పటివరకు అప్లై చేసుకోని నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం లభించినట్లయింది. అర్హులైన అభ్యర్థులు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషన్ సూచించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు

దరఖాస్తు గడువును పొడిగించినప్పటికీ, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రకటించిన తేదీ ప్రకారమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాబట్టి గ్రూప్-1 అభ్యర్థులు గడువు పొడిగింపును దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమమని అధికారులు పేర్కొన్నారు.

APPSC గడువు పొడిగించిన ఇతర ముఖ్యమైన పోస్టులు

గ్రూప్-1తో పాటు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని కీలక పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును కూడా పొడిగించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆ జాబితాలో ప్రధానంగా…

  • సహాయ పర్యావరణ ఇంజినీర్ (Assistant Environmental Engineer)
  • ఉద్యాన అధికారి (Horticulture Officer)
  • వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్-2 (Hostel Welfare Officer Grade-II)
  • సహాయ గిరిజన సంక్షేమ అధికారి మరియు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తుదారులు గమనించాల్సిన ముఖ్యాంశాలు

బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యార్హతలు, వయోపరిమితి మరియు ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉన్నార లేదా అని సరిచూసుకోవాలి. కేవలం అప్లికేషన్ గడువును మాత్రమే పొడిగించామని, పరీక్ష తేదీలు మరియు ఇతర నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని అభ్యర్థులు గమనించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

Epaper: epaper.vaartha.com

నిరుద్యోగులకు కీలక అప్‌డేట్.. PCB కీ ఎప్పుడు? AEE పరీక్షల తేదీలివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha