Dailyhunt
అప్పుల బాధ తాళలేక కోర్టులోనే వ్యాపారి ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధ తాళలేక కోర్టులోనే వ్యాపారి ఆత్మహత్యాయత్నం

వార్త 2 weeks ago

Visakhapatnam District Court: అప్పుల బాధ తాళ లేక ఓ కిరాణా వ్యాపారి జిల్లా కోర్టులోని జడ్జి ఎదురుగా ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన కలకలం సృష్టిస్తుంది.

వెంటనే కోర్టు సిబ్బంది గమనించి ఆ వ్యాపారిని కేజీహెచ్కు తరలించడంతో ప్రాణపాయం తప్పింది. జగదాంబ జంక్షన్, ఎల్లమ్మ తోట సమీపంలో నివాసముంటున్న కే శ్రీనివాసరావు (42)కు భార్య, పిల్లలు ఉన్నారు. స్థానికంగా జయరాం కిరాణా జనరల్ స్టోర్ పేరుతో దుకాణాన్ని శ్రీనివాసరావు నడుపుతున్నాడు.

Read Also : Challapalli Police Station Blast: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు..ఎస్ఐ సహా నలుగురికి తీవ్ర గాయాలు

 Businessman attempts suicide in court due to debt

Visakhapatnam District Court: ఫైనాన్సర్ల వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వ్యాపారం సరిగా లేక ఇటీవల శ్రీనివాసరావు స్థానికంగా అప్పుల పాలయ్యాడు. దీంతో ఫైనాన్సర్లు తీసుకున్న డబ్బులు చెల్లించాలని కిరాణా దుకాణం వద్దకు చేరుకొని వేధించడం ప్రారంభించారు. వేధింపులు తాళలేక సోమవారం ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో జిల్లా కోర్టుకు చేరుకొని న్యాయమూర్తి ఎదురుగా తనకు న్యాయం చేయాలని, లేదంటే చావే గతి అని పురుగుల మందు సేవించి శ్రీనివాసరావు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కోర్టు సిబ్బంది గమనించి వెంటనే అతనిని 108 అంబులెన్స్ ద్వారా కేజీహెచ్ కు తరలించారు. వైద్యులు అతనిని పరిశీలించి శ్రీనివాసరావు సేవించిన పురుగుల మందును ప్రస్తుతం అతని చేత కక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేజీహెచ్ చేరుకొని ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. సీఐ ఎర్రంనాయుడు నేతృతంలో రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి..ఇక కరెంట్ కష్టాలే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha