Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్రమత్తతే అసలైన మందు!

అప్రమత్తతే అసలైన మందు!

వార్త 2 weeks ago

Nutritious food : దేశ ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, చేస్తూనే ఉన్నారు.

ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ లెక్కలే నన్ని పథకాలు ప్రవేశపెట్టాయి. మన రాజ్యాంగనిర్మాతలు ప్రజారోగ్యం విషయంలో పాలకులు తీసుకోవాల్సిన చర్యల గూర్చి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా అందరికీ సంపూర్ణ ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. కనీస ఆరోగ్యవసతులు కల్పిం చడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పొచ్చు. ప్రజా రోగ్యంపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. కొన్ని వ్యాధులను నియంత్రించడం వైద్యులకు కూడా సాధ్యం కావడం లేదు. కొత్త మందులు, కొత్త చికిత్సలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా అంతకు రెట్టింపు స్థాయిలో కొత్తకొత్త వ్యాధులు విస్తరిస్తు న్నాయి. కోట్లాది మంది రోగపీడితులు అవుతున్నారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్నే చిగురుటాకులా వణికించిన కరోనా రక్కసి శాంతించినా అప్పుడు వాడిన మందుల ప్రభావం నుండి ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది కోలు కోలేకపోతున్నారు. గుండెజబ్బులు పెరిగిపోయాయి. వయ సుతో తేడాలేకుండా చిన్నాపెద్ద అందరూగుండెజబ్బులకు బలైపోతున్నారు.

Read Also : El Nino impact: ఎల్‌నినో దెబ్బ.. భారత్‌లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం

 Nutritious food

Malnutrition : సమతుల్యమైన మంచి పోషక విలువలు

ఇక కిడ్నీవ్యాధుల గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రం కిడ్నీవ్యాధుల్లో అగ్రస్థానం లో ఉన్నట్లు ఇటీవల వెల్లడించిన సర్వేలు స్పష్టం చేశా యి. డయాలసిస్ కేంద్రాలు ఎన్ని పెట్టినా సరిపోవడం లేదు. ఇక దోమల ద్వారా వస్తున్న వ్యాధులు అన్నీఇన్నీ కావు. వర్షాకాలం సీజన్ ఆరంభం కావడంతో కొత్త నీరు రాక, పాత నీరు కలయికతో వ్యాధులు విస్తరిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. గతంలో వచ్చిన స్వైన్ఫ్లూ, డెంగ్యూ, చికెన్గున్యా, ఒకటేమిటి రకరకాల విషజ్వరా లు విస్తరించే ప్రమాదం ఉన్నట్లు వైద్యనిపుణులు హెచ్చ రిస్తున్నారు. ఎబోలా వ్యాధి దేశంలో అంతగా విస్తరించ కపోయినా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా దేశంలో కొన్ని ప్రాంతాల్లో సోకుతున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎబోలా వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అయితే ఈ వ్యాధుల నుండి రోగనిరోధక శక్తి ఉన్నవారు బయటపడే అవకాశాలున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడుతు న్నారు. ఒక్కఅల్లోపతి డాక్టర్లే కాదు, ఆయుర్వేదం, హోమి యో, తదితర అన్ని విభాగాల డాక్టర్లు, వైద్యరంగ నిపు ణులు, శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలని సూచ నలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కొత్తగా చెప్ప డం లేదు. దశాబ్దాల తరబడి చెప్తూనేఉన్నారు. ఈ వాస్త వాలు ప్రజలకు కూడా తెలియనవి కావు. అయినా రోగ నిరోధక శక్తి ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? తదితర అంశాలు పరిశీలించాల్సిన సమయం ఇది. శరీరంలో రోగనిరోధక శక్తిని ఒక్క రోజుల్లోనో, ఒక్క వారంలోనో, ఒక్క నెలలో పెరిగేది కాదు. బాల్యం నుంచి సమతుల్యమైన మంచి పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని అందించాలి. ఏమేరకు అందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అర్థాకలితో అలమ టించేవారు

పౌష్టికాహార లోపంతో ప్రధానంగా నిరుపేదలు అల్లాడిపోతు న్నారు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు. అర్థాకలితో అలమ టించేవారు కోట్లసంఖ్యలో ఉన్నారు. వారిలో రోగనిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మరోపక్క కాలుష్యం ప్రజా రోగ్యాన్ని కాటువేస్తున్నది. ఢిల్లీలో చల్లికాలం వాయు కాలుష్యం చుట్టుముట్టడం ఆ పౌరులను ఉకి్కరిబిక్కిరి చేయడం ప్రతి యేడాది జరుగుతూనే ఉన్నది. ఢిల్లీలోనే కాదు భారతదేశంలోని అనేక నగ రాలు, పట్టణాలు, వాయు, నీటికాలుష్యంతో అతలాకుతలం అవుతున్నాయి. మరొకపక్క వాహన కాలుష్యం దీనికితోడవుతున్నది. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీక)తం కావడంలేదు. అన్నిటికంటే మించి కేన్సర్ వ్యాధి మాన వాళిపై పంజా విసరడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీ వల కేన్సర్కు సంబంధించి మందుల ధరలు ఒక్కసారి గా పెంచారు. ఇది మరింత ఆర్థిక భారం పడిందనే చెప్పొచ్చు. దేశంలో నాలుగేళ్ల క్రితం పధ్నాలుగు లక్షల అరవైవేలకుపైగా కేన్సర్కేసులు నమోదు కాగా ఇప్పుడది మరో నాలుగులక్షలకు అదనంగా నమోదవుతున్నట్లు వైద్య పరిశోధన మండలి, జాతీయ కేన్సర్ నమోదు కార్యక్రమం లెక్కలు చెబుతున్నాయి. ఈ కేన్సరుప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు జాతీయ ఆరోగ్య కమిషన్ పలుచర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం చెబుతున్నది.

 Nutritious food

ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ధనార్జన చేయడం

ధూమ పానం ఈ కేన్సర్ను పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం వల్ల నోరు, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక కేన్సర్ల నుండి తప్పించుకోవచ్చునని డాక్టర్లు సూచిస్తు న్నారు. మద్యపానం కూడా ప్రజారోగ్యానికి హాని కలిగి స్తున్న విషయం పెద్దలకు తెలియంది కాదు. ప్రజాసంక్షే మమే తమ లక్ష్యమని చెప్పుకునే పాలక పెద్దలు ఈ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ధనార్జన చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ఇ వేకాదు కల్తీ కూడా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలాంటివి ఎన్నో ప్రజల అనారోగ్యానికి కారణాలవుతు న్నాయి. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. ప్రజా రోగ్యానికి చేటు తెస్తున్న విధానాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు తమ ఆరోగ్యం విష యంలో అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కిలో పొగాకు రూ.200కు తగ్గకూడదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha