Saudi Aramco Helicopter Crash: సౌదీ అరేబియాలో (Saudi Arabia) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని ప్రముఖ తీరప్రాంత పారిశ్రామిక నగరం 'రాస్ తానూరా' (Ras Tanura) సమీపంలో జరిగిన ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదానికి గురైన సదరు హెలికాప్టర్.. ప్రపంచంలోనే అతిపెద్ద సౌదీ చమురు దిగ్గజ సంస్థ అయిన 'సౌదీ అరామ్కో' (Saudi Aramco)కు చెందినదిగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
Read Also :Seychelles Highest Civilian Award:ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
Saudi Aramco Helicopter Crash: ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

చమురు రవాణా, పర్యవేక్షణ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే సౌదీ సివిల్ డిఫెన్స్ (Saudi Civil Defense), అరామ్కో అత్యవసర రక్షణ విభాగాలు మరియు భద్రతా బలగాలు భారీగా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ వేగవంతం చేశారు. కాగా, ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా (Technical Snag) లేక వాతావరణంలో వచ్చిన అకస్మాత్తు మార్పులా అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు (High-Level Investigation) సౌదీ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..ల్యాండింగ్‌కు ముందే బాలిక మృతి!

