Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్హులందరికీ రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

అర్హులందరికీ రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

వార్త 1 week ago

Uttam Kumar Reddy: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేశామని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన అభివర్ణించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు - నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల పాలనలో మునుపటి ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రజలకు కేవలం నాణ్యత లేని దొడ్డు బియ్యం మాత్రమే అందించేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి సన్నబియ్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని వివరించారు.

Uttam Kumar Reddy: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా స్మార్ట్ రేషన్ కార్డులు

ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్‌ కార్డులు కేవలం ఆహార భద్రతకు మాత్రమే పరిమితం కాదని, అవి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక గౌరవం, గుర్తింపు అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సుమారు 3,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తులను పరిశీలించి, త్వరలోనే అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి భరోసా కల్పించారు.

రైల్వే తీపి కబురు: తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha