Cyclone Arnab: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం తీవ్రంగా దెబ్బతింది. తీరప్రాంత గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడటంతో పలుచోట్ల నివాసాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది.
అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, బలమైన ఈదురుగాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. తీరాన్ని రక్షించే రక్షణ గోడలు ధ్వంసం కావడం, రహదారులు దెబ్బతినడంతో అధికారులు అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేశారు.
Cyclone Arnab: అర్నాబ్ తుపాను.. ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచనలు
Arnab's fury: Around 30 houses razed to the ground by the intensity of monstrous waves
Cyclone Arnab: ఉగ్రరూపం దాల్చిన సముద్రం
తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్రంలో అలలు ఉగ్రరూపం దాల్చాయి. సుబ్బంపేట, ఉప్పాడ, సురాడపేట, జగ్గరాజుపేట, పల్లిపేట, రంగంపేట, మాయపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లోకి సముద్రపు నీరు దూసుకొచ్చింది. సుబ్బంపేట సమీపంలో ఎగసిపడిన అలల ధాటికి తీరాన్ని రక్షించేందుకు అమర్చిన భారీ బండరాళ్లు చెల్లాచెదురై, రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
సముద్రపు అలల ఉద్ధృతికి ప్రసిద్ధ ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా కోతకు గురైంది. సుబ్బంపేట వద్ద రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో పాటు తారు పొరలు ఊడిపోయాయి. రహదారి దెబ్బతినడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. దెబ్బతిన్న ఇళ్లు, రక్షణ గోడలు మరియు రహదారుల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సముద్రం ఇంకా ఉధృతంగానే ఉన్నందున ప్రజలెవరూ తీరప్రాంతాలకు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
Epaper: epaper.vaartha.com

