Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్ష్‌దీప్ సింగ్ పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

అర్ష్‌దీప్ సింగ్ పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

వార్త 1 week ago

Arshdeep Singh: పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక వీడియోలో తిలక్ వర్మను ఉద్దేశించి చేసిన రంగు వివక్ష వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.

దీనిపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తీవ్రంగా స్పందించారు. కేవలం సరదా కోసం చేసిన వ్యాఖ్యలుగా వీటిని చూడలేమని, ఇది కచ్చితంగా క్రమశిక్షణారాహిత్యమే అని ఆయన మండిపడ్డారు.

Read also: Akash Ambani: అంబానీ ముఖానికి తగిలిన ఫోన్.. కోపమొచ్చినా సరే చివర్లో పెద్ద మనసుతో!

 Arshdeep Singh Tilak Varma IPL controversy

Arshdeep Singh: తిలక్ వర్మపై రేసిస్ట్ కామెంట్స్ వివాదం

స్నాప్‌చాట్ వీడియోలో అర్ష్‌దీప్ మాట్లాడుతూ తిలక్ వర్మను ‘అంధేరే’ (చీకటి) అని పిలుస్తూ సన్‌స్క్రీన్ రాసుకున్నావా అని ఎగతాళి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అర్ష్దీప్ తీరును తప్పుబడుతున్నారు. సీనియర్ క్రికెటర్ శివరామకృష్ణన్ మాట్లాడుతూ.. క్రికెట్ అనేది ఒక వృత్తి అని, ఇక్కడ ఇలాంటి వివక్షా పూరిత వ్యాఖ్యలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

BCCI చర్యలు తీసుకుంటే నిజాలు చెబుతా

అర్ష్‌దీప్ పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సీజన్ నుంచి అతడిని సస్పెండ్ చేయాలని శివరామకృష్ణన్ డిమాండ్ చేశారు. ఒకవేళ బోర్డు గట్టి చర్యలు ప్రారంభిస్తే, గతంలో తనను కూడా ఇలాగే వర్ణ వివక్షతో వేధించిన క్రికెటర్ల పేర్లను బయటపెడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha