Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి అండగా నిలిచిన హీరో

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి అండగా నిలిచిన హీరో

వార్త 1 month ago

Ram Pothineni: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి భవ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. 'లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ' (Lafora Myoclonic Epilepsy) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా ఆమె గడప దాటలేక, మంచానికే పరిమితమైంది.

ఇటీవల మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో టాలీవుడ్ హీరో రామ్‌ పోతినేని స్పందించారు.

Read Also : Anupama Parameswaran: రెండేళ్ల పాటు తీవ్ర వేదన.. గత ప్రేమపై అనుపమ సంచలన వ్యాఖ్యలు

సహాయం కోరుతున్న కుటుంబ పరిస్థితి తెలుసుకున్న రామ్, వెంటనే ఆ యువతితో వీడియో కాల్‌లో మాట్లాడారు. తమ అభిమాన నటుడు స్వయంగా మాట్లాడటంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శశి భవ్యతకు అవసరమైన ఔషధాలు, ఆహారం, మరియు ఇతర నిత్యవసర ఖర్చులన్నింటినీ తానే చూసుకుంటానని రామ్ హామీ ఇచ్చారు.

Ram Pothineni: మెరుగైన వైద్యం, సోషల్ మీడియాకు ధన్యవాదాలు

అంతేకాకుండా, ప్రముఖ వైద్య నిపుణులతో మాట్లాడి ఆ బాలికకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటానని రామ్‌ భరోసానిచ్చారు. పాపను ఎప్పుడూ మానసికంగా సంతోషంగా ఉంచాలని, సమయానికి మందులు వేయాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. శశి భవ్యత దీనస్థితిని సమాజం దృష్టికి, తన దృష్టికి తీసుకొచ్చిన పాత్రికేయులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మరియు అభిమానులకు రామ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హీరో రామ్ చూపిన ఈ మానవత్వం, ఉదారత ఆ కుటుంబానికి ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.

మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha