Revanth Reddy: తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా అవసరాల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలో సాగు చేయకుండా ఖాళీగా ఉంచిన సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలని నిశ్చయించింది.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని భూములను విడతల వారీగా సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం వేగంగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 5 వేల ఎకరాల సేకరణ ప్రక్రియ మొదలుకాగా, అందులో 3 వేల ఎకరాలను పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ టీజీఐఐసీకి అప్పగించారు.
Read also: Narsapur Amma hospital: వైద్యుల నిర్లక్ష్యంతో 8 నెలల పసికందు మృతి!
Industrial land development in TG
Revanth Reddy: నిబంధనల ఉల్లంఘనపై రెవెన్యూ అధికారుల కొరడా
పేద రైతులకు కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం గతంలో ఈ అసైన్డ్ భూములను కేటాయించింది. చట్టం ప్రకారం ఈ భూములను వేరే వాళ్లకు అమ్మడం లేదా బదిలీ చేయడం పూర్తిగా నిషేధం. కానీ కొందరు నిబంధనలు దాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బిల్డర్లకు వీటిని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. 1977 అసైన్డ్ ల్యాండ్స్ చట్టం ప్రకారం రూల్స్ అతిక్రమిస్తే భూమిని వెనక్కి తీసుకునే హక్కు సర్కారుకు ఉండటంతో, అక్రమ లావాదేవీలు జరిగిన చోట నోటీసులు ఇస్తున్నారు.
భూములు ఇచ్చే రైతులకు ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ
సాంకేతికంగా అసైన్డ్ భూములు కోల్పోయే వాళ్లకు పరిహారం పొందే హక్కు లేకపోయినా, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద మంచి ప్రయోజనాలు కల్పిస్తోంది. భూములు అప్పగించే రైతులకు ప్రతి ఎకరానికి 800 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో ఈ ప్లాట్ల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది, వీటిని చట్టబద్ధంగా అమ్ముకోవచ్చు. తప్పుడు కొనుగోళ్లు చేసి చిక్కుల్లో పడ్డ వాళ్లు కూడా స్వచ్ఛందంగా భూములు అప్పగిస్తే వాళ్లకు 300 చదరపు గజాల ప్లాట్లు ఇస్తూ వివాదాలు లేకుండా చూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
లులు మాల్ మిక్చర్ ప్యాకెట్లో ఫ్రైడ్ బల్లి.. ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్!

