Elections 2026: తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు మరియు పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న విడతల వారీ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
మొదటి రెండు గంటల్లోనే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
Read Also: Iran-America War: ఇంటర్నెట్ కేబుళ్లను టార్గెట్ చేస్తున్న ఇరాన్..వణకుతున్న దేశాలు
Elections 2026: ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
| రాష్ట్రం | పోలింగ్ శాతం (9 AM వరకు) |
| తమిళనాడు | 17.69% |
| పశ్చిమ బెంగాల్ | 18.76% |
తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
Assembly Election 2026 Polling Percentage
ముఖ్య విశేషాలు
- తమిళనాడు: ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, నటుడు మరియు టీవీకే అధినేత విజయ్, ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అధికంగా కనిపిస్తోంది.
- పశ్చిమ బెంగాల్: బెంగాల్‌లో కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉదయం ఎండ తీవ్రత పెరగకముందే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
IRS అధికారి కుమార్తె హత్య.. నిందితుడి విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు!

