Dailyhunt
Asim Munir:రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

Asim Munir:రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

వార్త 3 months ago

పాకిస్థాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ అసిమ్ మునీర్(Asim Munir) కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అత్యంత రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.

మహనూర్, ప్రస్తుతం సివిల్ సర్వీసుల్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్‌ను వివాహం(Asim Munir) చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్లు పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అత్యున్నత నేతల హాజరు, కట్టుదిట్టమైన భద్రత

ఈ వివాహానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు ఐఎస్ఐ చీఫ్ మరియు ఇతర ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. మొత్తం సుమారు 400 మంది అతిథులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారని తెలుస్తోంది. వేడుక అంతటా భద్రతను మరింత కఠినంగా అమలు చేసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

China: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha