Nallamala tiger death : శ్రీశైలం - నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలోని మార్కాపురం జిల్లా, గిద్దలూరు అటవీ డివిజన్ రాచర్ల బీట్ తెట్టుమడుగు వద్ద పెద్దపులి కళేబరం లభించడం తీవ్ర కలకలం రేపింది.
దట్టమైన కీకారణ్యం కాకపోయినా, వాహనాలు రాకపోకలు సాగించే రహదారి సమీపంలోనే ఈ ఘటన జరగడం మరియు పులి చనిపోయి రెండు వారాలు దాటినా అటవీ సిబ్బంది గుర్తించకపోవడం క్షేత్రస్థాయి గస్తీ విఫలమైందనడానికి అద్దం పడుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డీఆర్‌సీ (DRC) సమావేశంలో నిలదీసినట్లుగా.. వెదురు బొంగులు తెచ్చుకునే సాధారణ పేదలపై ప్రతాపం చూపే అధికారులు, వేటగాళ్లు పులులను చంపుతుంటే కనీసం పసిగట్టలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read also: YS Jagan: నేడు దేవరపల్లిలో పర్యటించనున్న వైఎస్ జగన్
Nallamala tiger death
Nallamala tiger death : స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ – విచారణ వేగవంతం
నల్లమలలో పెద్దపులి మృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. వన్యప్రాణుల సంరక్షణలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ, పారదర్శకమైన ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ వ్యవస్థను సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ‘హైపవర్డ్ కమిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితుల కాల్ డేటా, స్థానిక సమాచారం ఆధారంగా వేటగాళ్ల నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి పులి గోళ్లు, వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులిని ఎలా హతమార్చారనే విషయాన్ని అధికారులు ఇప్పటికీ స్పష్టంగా బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్లు అమర్చిన విద్యుత్/ఇనుప ఉచ్చులో చిక్కుకుని పులి చనిపోయి ఉంటే, అడవిలో ఉచ్చులు తొలగించడంలో తమ వైఫల్యం బయటపడుతుందనే భయంతోనే అధికారులు వివరాలను దాస్తున్నారనే చర్చ అటవీశాఖ వర్గాల్లోనే నడుస్తోంది. ఫోరెన్సిక్ మరియు పోస్టుమార్టం నివేదికల ఆధారంగా అసలు నిజాలు బయటకు రానున్నాయి.
Epaper: epaper.vaartha.com
విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు కాదు.. ట్రూడౌన్ మాత్రమే చేశాం: గొట్టిపాటి రవి

