Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్తపై అల్లుడి కిరాతకం.. ఏం చేసాడంటే?

అత్తపై అల్లుడి కిరాతకం.. ఏం చేసాడంటే?

వార్త 1 month ago

Medipalli Crime: మేడిపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటన నిజంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. హెల్మెట్‌ను రక్షణ కోసం వాడాల్సింది పోయి, ఇలా ఒక ప్రాణాన్ని తీయడానికి ఆయుధంగా వాడటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం.

ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల వల్ల నిందితుడి నాటకం బయటపడటం ఈ కేసులో కీలక మలుపు తీసుకుంది.

Read Also:Instagram Fraud: రీల్స్ చూసి మోసపోతే రియల్ లైఫ్ గోవిందా! ఇన్‌స్టాగ్రామ్ కిలేడీ ముఠా అరెస్ట్

Medipalli Crime: గొడవే కారణం..

చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ చిన్న కుమార్తె కావ్య, గతేడాది కరీంనగర్‌కు చెందిన స్నేహిత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైనప్పటి నుండి అల్లుడు స్నేహిత్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అత్తతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే అరుణ, అల్లుడు స్నేహిత్ తో కలిసి బైక్‌పై వెళ్తున్నారు. ప్రయాణంలో ఉండగానే ఇద్దరి మధ్య పాత విషయాలపై వాగ్వాదం మొదలైంది. కోపంతో ఊగిపోయిన స్నేహిత్, బైక్ నడుపుతూనే తన తలకున్న హెల్మెట్‌ను తీసి అత్త తలపై బలంగా కొట్టాడు. ఈ దాడితో ఒక్కసారిగా అదుపుతప్పిన అరుణ, రన్నింగ్ బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

వెంటనే అతడు భయంతో ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటూ స్నేహిత్ ఫోన్ చేసి కావ్యకు చెప్పాడు. ఆ తర్వాత బాధితురాలు అరుణను మెడిస్టార్ ఆసుపత్రి ఆర్‌బీఎం ఆసుపత్రికి తరించారు.స్నేహిత్ చెప్పిన మాటలు కావ్య నమ్మలేదు. అనుమానంతో కావ్య సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీలో స్నేహిత్, బైక్‌పై వెళ్లే సమయంలో అరుణతో వాగ్వాదానికి దిగినట్లుగా కనిపించింది.హెల్మెట్‌తో ఆమె తలపై దాడిచేసినట్టు స్పష్టంగా రికార్డు అయింది. అదే క్రమంలో ఆమె బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న అత్త అరుణ మృతిచెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తుమకూరులో బర్డ్ ఫ్లూ కలకలం..44 నెమళ్ల బలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha