Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవగాహనే కల్తీకి అసలైన అడ్డుకట్ట

అవగాహనే కల్తీకి అసలైన అడ్డుకట్ట

వార్త 3 weeks ago

Adulteration: నేటి సమాజంలో కల్తీ అనేది కేవలం ఆహార పదార్థాలకే పరిమితం కాలేదు. మనం తినే ఆహారం నుంచి, తాగే నీరు వరకు, వాడే మందుల నుంచి, రోజువారీ వినియోగ వస్తువుల వరకు అనేక రంగాల్లో నాణ్యతలేని ఉత్పత్తులు విస్తరిస్తున్నాయి.

ఫలితంగా ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. నేటి సామాన్యుడు పెరుగుతున్న ధరలతో ఇప్పటికే కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతున్నాడు. సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ‘తక్కువ ధరకు వస్తే చాలు’ అనే ఆలోచనతో వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. కానీతక్కువ ధర కోసం తీసుకున్న ఆ నిర్ణయమే కొన్నిసార్లు జీవితాం తం బాధను మిగులుస్తోంది. ఆహారంలో నాణ్యత లేకపోవ డం వల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక రకాల అనారోగ్యసమస్యలు ఎదురవుతున్నాయి. కల్తీపాలు, నూనెలు, మసాలా దినుసులు, తీపి పదార్థాలు, పండ్లు, కూరగాయలు, తేనె వంటి అనేక ఆహారపదార్థాల్లో కల్తీ పెరుగుతోం ది. ఇవి శరీరంలో నెమ్మదిగా విషంలా పనిచేసి క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తాను సంపాదించిన డబ్బును వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. చివరికి తక్కువ ధరకు కొన్నవస్తువు వల్ల ఎక్కువ నష్టాన్ని చవి చూస్తున్నాడు.

 Adulteration

Adulteration: అవగాహన పెరగడం కూడా అత్యంత అవసరం

ప్రజల ఆర్థిక బల హీనతను కొందరు వ్యాపా రులు అవకాశంగా మలుచుకుంటున్నారు. నాణ్యత లేని ముడిపదార్థాలతో వస్తువులు తయారు చేసి, ఆకర్షణీయ మైన ప్యాకింగ్తో మార్కెట్లో విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. కొందరు నకిలీ బ్రాండ్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిజాయితీగా వ్యాపారంచేసే వారు నష్టపోతుండగా, అక్రమంగా సంపాదించే వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. కల్తీని పూర్తిగా అరికట్టడం కష్టమే కావ చ్చు. కానీ కఠినమైన చట్టాల అమలు, నిరంతర తనిఖీలు, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించే విధానం, నేర స్థులకు వేగవంతమైన శిక్షలు ఉంటే పరిస్థితిలో గణనీయ మైన మార్పుతీసుకురావచ్చు. అలాగే వినియోగదారుల్లో అవగాహన పెరగడం కూడా అత్యంత అవసరం. ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొనుగోలు చేసే వస్తు వుల తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత గుర్తులు, తయా రీదారు వివరాలు పరిశీలించాలి. అనుమా నాస్పదమైన వస్తువులను కొనకుండా ఉండాలి. బిల్లు తప్ప నిసరిగా తీసుకోవాలి. కల్తీ లేదా నాణ్యతలేని వస్తువులు కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. వినియోగ దారుల హకు స్త్రీలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రభుత్వ శాఖలు, ఆహార భద్రత అధికారులు, వినియోగ దారుల సంఘాలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కల్తీ ఉత్పత్తులను కొంతవరకైనా ఆరికట్టాలంటే ప్రజల భాగ స్వామ్యం ఎంతో అవసరం.

 Adulteration

ప్రత్యేక మొబైల్ యాప్

అందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలి, ఎవరైనా ఆహార పదార్థాలు, మందులు లేదా ఇతర వస్తువుల నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తే, వెంటనే ఆ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవ కాశం ఉండాలి. ఆ యాప్లో వస్తువు ఫొటోలు, వీడియో లు, కొనుగోలు చేసిన బిల్లు, దుకాణం పేరు, చిరునామా, కొనుగోలు చేసిన తేదీ, లొకేషన్ వంటి వివరాలను నమోదు చేసే సౌకర్యం కల్పించాలి. ఫిర్యాదు నమోదైన వెంటనే అది సంబంధిత ఆహార భద్రత, వినియోగదారుల పరిరక్షణ లేదా ఇతర తనిఖీ అధికారులకు చేరేలా వ్యవస్థ రూపొందించాలి. ప్రతి ఫిర్యాదుకు ఒక ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ ఇచ్చి, దాని పురోగతిని ఫిర్యాదు చేసిన వ్యక్తి యాప్లోనే తెలుసుకునే అవకాశం కల్పించాలి. ఫిర్యాదు నిజమని తేలితే సంబంధిత వ్యాపార సంస్థపై వెంటనే తనిఖీలు నిర్వహించి, అవసరమైతే వస్తువులను స్వాధీనం చేసుకోవడం, భారీ జరిమానాలు విధించడం, లైసెన్స్ రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా, ఒకే దుకాణం లేదా తయారీ సంస్థపై పదేపదే ఫిర్యాదులు వస్తే వాటిని ప్రత్యేకంగా గుర్తించి కఠిన పర్య వేక్షణలో ఉంచాలి. తప్పుడు ఫిర్యాదులు తగ్గించేందుకు ఆధారాలతో కూడిన ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇవ్వాలి.

-డాక్టర్. వై. సంజీవ కుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

మందుబాబులకు షాక్! తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు.. కొత్తగా 150ml బాటిళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha