Chamala Kiran Kumar Reddy: అయోధ్య రామ మందిర నిర్మాణ నిధుల సేకరణలో ఏకంగా రూ. 200 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వివాదంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించినప్పటికీ, ఉత్తరప్రదేశ్ సిట్ (SIT) పోలీసులు ఆయనకు అత్యంత సన్నిహితులనే అదుపులోకి తీసుకోవడం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

కేవలం చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను వారి పదవుల నుండి తొలగించి బీజేపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించాలని చూస్తోందని ఎంపీ విమర్శించారు. ఈ భారీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
Chamala Kiran Kumar Reddy: దేవుడి సొమ్ముతో రాజకీయాలు.. ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోళ్లు!
దేశప్రజల ధార్మిక సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని, రాముడి పేరుతో సేకరించిన విరాళాల సొమ్మును బీజేపీ రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలను, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను లొంగదీసుకోవడానికి ఈ నిధులనే ఉపయోగించారని ఆరోపించారు. ఒక్కొక్క ఎంపీ కొనుగోలుకు రూ. 75 కోట్ల చొప్పున రాముడి సొమ్మును వెచ్చించారంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
గతంలో నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడినట్లుగానే, ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ వ్యవహారంలోనూ పెద్దలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలపై కేవలం పదవుల తొలగింపు చర్యలతో సరిపెట్టకుండా, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
బంగారం పేరుతో వంచన: పాతబస్తీ 'గోల్డ్‌మ్యాన్' సూర్యాభాయ్‌పై చీటింగ్ కేసు

