Ravi Teja New Movie Glimpse: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), ఫ్యామిలీ ఎమోషన్స్ స్పెషలిస్ట్ దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఇరుముడి' (Irumudi) నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
ఈ పీరియాడిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' (The Heart of Irumudi) గ్లింప్స్‌ను చిత్ర బృందం బుధవారం (జూన్ 3) అధికారికంగా విడుదల చేసింది.
అయ్యప్ప భక్తుడిగా, తండ్రిగా రవితేజ సరికొత్త అవతారం

ఇప్పటివరకు రవితేజను పక్కా కమర్షియల్, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ పాత్రల్లోనే ఎక్కువగా చూశాం. కానీ ‘ఇరుముడి’లో ఆయనను శివ నిర్వాణ సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, అలాగే అయ్యప్ప స్వామి యొక్క పరమ భక్తుడిగా ఎంతో ఎమోషనల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' వీడియోలో తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అమూల్యమైన అనుబంధాన్ని, సెంటిమెంట్‌ను దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. రవితేజ మార్క్ యాక్షన్‌తో పాటు ఆయన పండించిన ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
మాస్ రాజా హిట్ ట్రాక్ ఎక్కేనా..?
వరుస పరాజయాలతో కాస్త ఇబ్బందికరమైన ఫేజ్‌ను ఎదుర్కొంటున్న రవితేజకు ఈ సినిమా విజయం ఎంతో కీలకం. బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా.. ఈ విలక్షణమైన కథాంశంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన ఎనర్జీకి, శివ నిర్వాణ మార్క్ క్లాసిక్ ఎమోషన్స్ తోడైతే థియేటర్లలో మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

