Vande Bharat Express:కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. నవంబర్ 1వ తేదీన బెంగళూరు నుంచి ముంబై వరకు కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది.
ఈ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం గుంతకల్లు స్టేషన్ల గుండా రాకపోకలు సాగిస్తుంది.
Brahmana Kotkur MPTC Election:బ్రాహ్మణ కొట్కూర్ ఎంపీటీసీ-2 ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం
Another Vande Bharat Sleeper for AP
విశాఖ తిరుపతి రైల్వే ప్రతిపాదనలు
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు వరకు వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని కోరారు. అలాగే విశాఖ తిరుపతి నగరాల మధ్య పగటిపూట ప్రత్యేక రైలు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Vande Bharat Express:రైల్వే అభివృద్ధికి కేంద్రం సానుకూలం
ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. కనిగిరి విజయవాడ రైల్వే లైన్ నిర్మాణ పనులపై కూడా చర్చలు జరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించి రాష్ట్రంలో రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయి.
Epaper: epaper.vaartha.com
ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత.. రూ.4 కోట్ల గంజాయి స్వాధీనం!

