Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? అసలు నిజం ఇదే !!

బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? అసలు నిజం ఇదే !!

వార్త 0 months ago

Almond : రోజువారీ ఆహారంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన బాదం పప్పుల వినియోగంపై సమాజంలో ఒక సాధారణ అపోహ బలంగా నాటుకుపోయింది. ముఖ్యంగా వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, ఒంట్లో వేడి చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు.

అయితే, ఈ ఆందోళనలో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం కాలక్రమేణా స్థిరపడిపోయిన ఆహారపు అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల ఇది కాస్త బరువైన ఆహారంగా అనిపించినప్పటికీ, దీని వల్ల శరీరంలో అదనపు వేడి పుట్టదు. మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమాద్దర్ వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సుతో సంబంధం లేకుండా సమతుల్య దినచర్యలో భాగంగా ఏడాది పొడవునా, అన్ని కాలాల్లోనూ బాదం పప్పులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

24 పోషకాల సూపర్ ఫుడ్.. నానబెట్టడంపై క్లారిటీ

కాలిఫోర్నియా బాదం పప్పులలో విటమిన్ ఇ, ప్రొటీన్, మెగ్నీషియం, ఫైబర్, జింక్ వంటి సుమారు 24 రకాల అత్యవసర పోషకాలు నిండి ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాల వలె కాకుండా, బాదం శరీరానికి రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తూ, ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. రోజుకు 43 గ్రాముల బాదం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగకుండానే విటమిన్ ఇ మరియు మంచి కొవ్వులు అందుతాయని పరిశోధనలు సైతం నిరూపించాయి. ఇక బాదం పప్పులను తినే ముందు నానబెట్టాలా వద్దా అనే అనుమానాలపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. బాదంను నానబెట్టడం వల్ల అవి మృదువుగా మారి నమలడానికి సులభంగా ఉంటాయే తప్ప, పోషకాల పరంగా నానబెట్టని బాదంతో పోలిస్తే పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఎముకల బలానికి, కండరాల క్రమబద్ధీకరణకు తోడ్పడే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్‌ను ఎలాంటి భయాలు లేకుండా ప్రతిరోజూ గుప్పెడు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

జుట్టు కుచ్చులుగా రాలడం వెనుక కారణాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha