Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాధితురాలి వయసుపై హైకోర్టు కీలక ప్రశ్నలు.. రేపు మధ్యంతర బెయిల్‌పై తీర్పు!

బాధితురాలి వయసుపై హైకోర్టు కీలక ప్రశ్నలు.. రేపు మధ్యంతర బెయిల్‌పై తీర్పు!

వార్త 1 week ago

పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలి వయస్సు మరియు కేసు నమోదులో జరిగిన జాప్యంపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రధానంగా బాధితురాలి వయస్సును ప్రస్తావించారు. గతంలో పోలీసు రికార్డుల్లో ఒక రకమైన వయస్సు ఉండగా, ప్రస్తుతం పోక్సో కేసులో మరో రకమైన వయస్సును చూపారని కోర్టుకు తెలిపారు.
ఛార్జ్ షీట్, పాన్ కార్డ్ మరియు ఇతర ధ్రువపత్రాల్లో జన్మతేదీలు ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించిన హైకోర్టు, బాధితురాలి అసలు బర్త్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది.

Read Also: Hyderabad News: ఎల్బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి ICUలో చికిత్స

 Bandi Bhagirath

Bandi Bhagirath: న్యాయవాదుల వాగ్వాదం – కోర్టు అసహనం

విచారణ సమయంలో బాధితురాలి తరఫు న్యాయవాది భగీరథ్‌ను ‘క్రిమినల్’ అని సంబోధించడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. నేరం నిరూపణ అయ్యే వరకు ఎవరినీ నేరస్తుడు అనకూడదని హితవు పలికింది. న్యాయవాదులు సంయమనం పాటించాలని, లేనిపక్షంలో పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మారుస్తామని హెచ్చరించింది. ఫోన్ కాల్స్ డేటా కీలకం. భగీరథ్ తరఫు న్యాయవాది మరికొన్ని కీలక అంశాలను కోర్టు ముందు ఉంచారు. ఘటనలు జరిగాయని చెబుతున్న సమయానికి ముందు మరియు తర్వాత కూడా నిందితుడు, బాధితురాలు గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకున్నారని వివరించారు. ఘటన జరిగిన నాలుగున్నర నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మొదట తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేసి, ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సెక్షన్లను మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనే అంశంపై తన తీర్పును రేపటికి (మే 15) వాయిదా వేసింది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి షెడ్యూల్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha