Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాధ్యతల స్వీకరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ

బాధ్యతల స్వీకరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ

వార్త 3 weeks ago

Telangana New DGP: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తనపై నమ్మకం ఉంచి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: Harish Rao: నా ప్రయత్నం.. నా తాపత్రయం మీ పిల్లలకు మంచి విద్యా.. మంచి ఉత్తిర్ణత కోసమే!

 CV Anand meets CM Revanth Reddy

Telangana New DGP: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

ప్రజలకు రక్షణ కల్పించడంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పనిచేస్తానని సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి

మరోవైపు, డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. చీఫ్ సెక్రటరీ (CS) హోదాలో ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా ఆయనకు నెలకు రూ. 2.25 లక్షల వేతనం అందనుంది. వేతనంతో పాటు ప్రత్యేక కార్యాలయం, అధికారిక వాహనం, ఇతర ప్రోటోకాల్ సదుపాయాలను ప్రభుత్వం ఆయనకు కల్పించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha