Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాడీ షేమింగ్, సర్జరీ పుకార్లపై కీర్తి సురేష్ స్పందన

బాడీ షేమింగ్, సర్జరీ పుకార్లపై కీర్తి సురేష్ స్పందన

వార్త 6 days ago

Keerthy Suresh: సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటి కీర్తి సురేశ్. 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అలాగే ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, ఇటీవలి కాలంలో కీర్తి సురేశ్ కాస్త స్లిమ్‌గా మారడంతో ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, పుకార్లు వస్తున్నాయి. ఆమె బరువు తగ్గడం వెనుక ఏదైనా సర్జరీ ఉందేమోనంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ కీర్తి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ, తన ఫిట్‌నెస్ జర్నీని పంచుకున్నారు.

Read Also : Balakrishna : నయనతార కు షాక్ ఇచ్చిన బాలకృష్ణ మూవీ టీం

Keerthy Suresh: బాడీ షేమింగ్‌పై ఆవేదన

చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నావని సన్నబడమన్నారు.. తీరా కష్టపడి సన్నబడ్డాక గతంలోనే బాగున్నావంటున్నారు. అసలు ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ బాడీ షేమింగ్‌పై కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, కేవలం సహజ పద్ధతుల్లో, కఠిన శ్రమతోనే ఈ ఫిట్‌నెస్ సాధించానని ఆమె స్పష్టం చేశారు. రాత్రి పగలు కష్టపడి సాధించిన ఫలితాన్ని, కొందరు చాలా సులువుగా సర్జరీ ఖాతాలోకి నెట్టేయడం చూసి తనకు ఎంతో బాధ కలిగిందని కీర్తి పేర్కొన్నారు.

బరువు తగ్గింది ఇలా..

తనకు జిమ్, డైట్, ఫిట్‌నెస్ గురించి పెద్దగా అవగాహన లేదని కీర్తి సురేష్ వెల్లడించారు. అయితే, 'మహానటి' సినిమా తర్వాత లభించిన విరామంలో ఎలాగైనా బరువు తగ్గాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం నిపుణుల పర్యవేక్షణలో అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకున్నారు. సరైన డైట్ ప్లాన్, వర్కవుట్స్ ద్వారా కేవలం 9 నెలల కాలంలోనే ఆమె ఏకంగా 10 కిలోల బరువు తగ్గినట్లు వివరించారు.

జీవితాన్ని మార్చేసిన యోగా

"ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం లేని వ్యాయామం.. ఇప్పుడు నా జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. ఇప్పుడు దాన్ని అస్సలు వదిలిపెట్టలేకపోతున్నా" అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ఎంతో ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను పాటిస్తున్నట్లు కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీలీల డేటింగ్ పుకార్లపై స్పందించిన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha