Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాకీ కోసం నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి!

బాకీ కోసం నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి!

వార్త 1 month ago

Pune Recovery Agent Attack: మహారాష్ట్రలోని పుణే నగరంలో ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు బరితెగించారు. హడప్సర్ ప్రాంతంలోని '15 నంబర్ చౌక్' వద్ద ఒక వ్యక్తిని అతని భార్య ముందే నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు.

క్రెడిట్ కార్డ్ బాకీల వసూలు పేరుతో జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఏజెంట్లు గూండాల్లా వ్యవహరించడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు.

Read Also: Tadipatri crime updates: తాడిపత్రిలో హిజ్రాల వర్గపోరు - ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్

Pune Recovery Agent Attack: క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం దాడి

వివరాల్లోకి వెళ్తే, సదరు వ్యక్తి తీసుకున్న క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన రికవరీ ఏజెంట్లు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, అతడిని బూతులు తిడుతూ దైహికంగా దాడికి దిగారు. బాధితుడి భార్య వేడుకుంటున్నా వినకుండా ఏజెంట్లు కర్కశంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :’

నాసిక్ టీసీఎస్‌ కేసులో 'మలేషియా' కనెక్షన్‌.. ఉద్యోగిని పేరు మార్చి విదేశాలకు తరలించేందుకు స్కెచ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha