Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్ వద్ద హవా.. 'మా ఇంటి బంగారం' ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?

బాక్సాఫీస్ వద్ద హవా.. 'మా ఇంటి బంగారం' ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?

వార్త 1 week ago

Maa Inti Bangaram Collections: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ నెల 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలి వారాంతంలోనే (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన సందర్భంగా 'బ్లాక్‌బస్టర్ బంగారం' అని పేర్కొంటూ చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read also: Samantha interview: నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

 Ruling the box office… Here are the first-weekend collections of 'Maa Inti Bangaram'.

Maa Inti Bangaram Collections: రోజురోజుకూ పెరుగుతున్న కలెక్షన్ల గ్రాఫ్

ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన తొలి రోజైన శుక్రవారం ఈ సినిమా రూ. 13.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం నాటికి ఈ వసూళ్లు రూ. 28 కోట్లను దాటాయి. ఇక, వీకెండ్‌లో చివరి రోజైన ఆదివారం నాడు కలెక్షన్లు మరింత జోరందుకున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్క ఆదివారమే ఏకంగా రూ. 15 కోట్ల గ్రాస్ వసూలైంది. రోజురోజుకూ పెరుగుతున్న ఈ వసూళ్ల సరళిని బట్టి చూస్తే, ఈ చిత్రం అతి త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత నటనతో పాటు నందినీ రెడ్డి మార్క్ కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ అంతా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం పట్ల, సినిమాకు వస్తున్న భారీ ఆదరణ పట్ల చిత్రయూనిట్ అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha