Balapur Ganesh Laddu: హైదరాబాద్ వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ బడా గణేష్‌కు ఎంతటి ప్రత్యేక గుర్తింపు ఉందో.. బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది.
ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా జరిగే ఈ వేలం ఈసారి కూడా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది 21 కిలోల బాలాపూర్ మహాగణపతి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ. 39 లక్షల ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. 20 మందికి పైగా తీవ్రంగా పోటీపడిన ఈ వేలంపాటలో సామ ప్రణీత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు.
Read Also : Hyderabad ganesh immersion: ఇరవై వేల బలగాలతో భాగ్యనగరం భారీ బందోబస్తు
New record for Balapur Laddu… Who secured it this time?
Balapur Ganesh Laddu: 1994 నుంచి ప్రారంభమైన వేలం ప్రస్థానం
1980లో స్థానికంగా ప్రారంభమైన బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో 1994లో తొలిసారి లడ్డూ వేలం సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మొదటి ఏట నిర్వహించిన వేలం పాటలో స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి రూ. 450కే లడ్డూను దక్కించుకున్నారు. ఆ మరుసటి ఏడు (1995) కూడా ఆయనే రూ. 4,500కు పాడి లడ్డూ ప్రసాదం పొంది పంటలు బాగా పండటంతో ఈ లడ్డూకు సెంటిమెంట్ పెరిగింది. అక్కడి నుంచి ఏటేటా లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది:
- 1996 – 2002: 1996లో రూ. 18 వేలు పలకగా, 2002 నాటికి తొలిసారిగా రూ. 1.05 లక్షలతో లక్ష మార్కును దాటింది.
- 2007 – 2014: 2007లో రూ. 4.15 లక్షలు, 2012లో రూ. 7.50 లక్షలు, 2014 నాటికి రూ. 9.50 లక్షలకు చేరింది.
- 2015 – 2023: 2015లో రూ. 10.32 లక్షలతో పది లక్షల మార్కు దాటింది. 2019లో రూ. 17.60 లక్షలు పలకగా (2020లో కరోనా వల్ల వేలం జరగలేదు), 2023లో రూ. 27 లక్షలు పలికింది.
- 2024 – 2025: 2024లో రూ. 30.01 లక్షలు కాగా, 2025లో రూ. 1,116తో ప్రారంభమైన వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ. 35 లక్షలకు దక్కించుకున్నారు.
ప్రసాదం సెంటిమెంట్..
బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. లడ్డూను పొందిన వారు దానిని కుటుంబ సభ్యులు, బంధువులకు పంచడంతో పాటు, పంటలు సమృద్ధిగా పండాలని పొలాల్లో చల్లుతారు. ఇక వేలం పాట ద్వారా సమకూరిన నిధులను ఉత్సవ సమితి సభ్యులు బాలాపూర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి, పాఠశాలల నిర్మాణానికి, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుండటం ఈ వేలంపాటలోని మరో గొప్ప విశేషం.
ఖైరతాబాద్ గణేశుడి భారీ వాహనం నడిపేది ఎవరో తెలుసా? 26 ఏళ్లుగా డ్రైవర్‌గా..

