Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య NBK111 లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

బాలయ్య NBK111 లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వార్త 2 weeks ago

Balakrishna NBK111 Movie: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'NBK111' నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు (జూన్ 19) సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఈరోజు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్‌లో కనిపించి అలరించారు. సింపుల్ చీరకట్టు, కళ్లజోడు ధరించి ఎంతో గంభీరంగా, సీరియస్ లుక్‌తో ఆమె ఇచ్చిన పోజ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కాజల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమాలో ఆమె చేయబోయే పాత్ర కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొంది.

Read Also: Spirit Update : 'స్పిరిట్'లో ప్రభాస్ ఎంట్రీ సీన్..పూనకాలు తెప్పిస్తుందట !!

Balakrishna NBK111 Movie: 'భగవంత్ కేసరి' తర్వాత క్రేజీ కాంబో రిపీట్!

బ్లాక్‌బస్టర్ హిట్ 'భగవంత్ కేసరి' చిత్రం తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఆ సినిమాలో కాజల్ పోషించిన సైకాలజిస్ట్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, 'NBK111'లో మాత్రం ఆమె కేవలం పరిమిత పాత్రకే పరిమితం కాకుండా.. పూర్తిస్థాయి హీరోయిన్‌గా, కథను ఒక కీలక మలుపు తిప్పే వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది.

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, హై ఇంటెన్స్ ఎమోషన్స్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో గతంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

కాక్‌టెయిల్ 2 మూవీ రివ్యూ.. కృతి నటన అదుర్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha