Dailyhunt
బాలుడు కిడ్నాప్.. విషాదంగా ముగిసిన ఉదంతం

బాలుడు కిడ్నాప్.. విషాదంగా ముగిసిన ఉదంతం

వార్త 3 weeks ago

Yadiki Crime: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఏడేళ్లు బాలుడుడిని సొంత భావనే హతమార్చాడు.

దీనికి సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోనుప్పలపాడులో నిన్న సాయంకాలం బావ వరుసయ్యే బోయ సర్వేశ్ బాలుడిని స్కూల్ నుంచి తీసుకెళ్లి నిర్మానుష్యంగా అడవి ప్రాంతంలో తీవ్రంగా కొట్టి ఆపై గొంతు నులిమి హతమార్చాడు. అనంతపురం అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బాలుడు కనిపించకపోయేసరికి తీవ్ర ఆందోళనలతో తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నప్ చేసిన బాలుడు కోసం అన్వేషణ చేశారు. ఇందులో భాగంగా బాలుడు మృతుదేహం కనుగొన్నారు. అప్పటి వరకు తమ కళ్ళముందే ఆడుతూ కనిపించిన బాలుడు నిర్జీవంగా పడివున్న శవాన్ని చూసి గుండెలు భాదుగోసాగారు. ఈ ఘటన స్థానికక్నగా తీవ్ర కలకలం, ఆవేదన కలిగించింది.

Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Yadiki Crime: వివరాల్లోకి వెళితే

కోనుప్పలపాడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర (7) ఉన్నారు. యాడికిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హేమచంద్ర యూకేజీ చదువుతున్నాడు. అయితే, బుధవారం ఉదయం స్కూలు బస్సులో పాఠశాలకు వెళ్లిన వచ్చిన హేమచంద్రను సర్వేశ్ కిడ్నాప్ చేశాడు. వేమ్ చంద్ర అక్కను వివాహం చేసుకున్న బోయ సర్వేష్, ఉగాది పండుగ సందర్భంగా భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు.

అయితే, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, డబ్బు కోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. బాలుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, సీసీటీవీ ఫ్యూటజీ ఆధారంగా బోయ సర్వేశ్ ఏ నింధుతుడని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం అనంతరం కుందనకోట చింతలాయపల్లి కొండలలో మృతదేహం లభ్యమైనది. చిన్నారి మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ద్రిగ్భాంతికి గురయ్యారు. ఈ ఘటన తో ఆ జిల్లాలో తీవ్ర విషాధచాయలు అలుముకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

దమ్మాయిగూడలో దారుణ హత్య.. పొదల్లో మహిళ మృతదేహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha