Bapatla Train Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పరిసర ప్రాంతాల్లో రైళ్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస చోరీలు, పోలీసుల కాల్పుల ఉదంతం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాкиనాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటాక (సుమారు 1.15 గంటల సమయంలో) దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా, ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దుండగులు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు, ఇతర ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.
Read Also :Nellore Crime:నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
పొలాల్లోకి పరుగులు - పోలీసుల కాల్పులు
Bapatla Train Robbery Sircar Express Police Firing 9 Rounds Appikatla Nidubrolu SP Umamaheswara Rao Gold Theft
రైలు ఆగడంతో దొంగలు కిందికి దూకి, సమీపంలోని పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలులోనే ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపై 9 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే చీకటిని ఆసరాగా చేసుకుని దొంగలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు దుండగులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేయడంతో, ప్రస్తుతం అప్పికట్ల – బత్తిపూడి పరిసర పొలాల్లో నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Bapatla Train Robbery: రెండు నెలల్లో మూడు పెద్ద ఘటనలు: ఆందోళనలో ప్రయాణికులు
కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే, గత రెండు నెలల వ్యవధిలో ఒకే తరహా వ్యూహంతో (రైళ్లను ఆపడం, మహిళల నగలను టార్గెట్ చేయడం) వరుసగా మూడు సార్లు దొంగలు రెచ్చిపోవడం రైల్వే భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
హనుమకొండలో ఘోరం: పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం

