Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాసర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

బాసర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

వార్త 1 day ago

Basara temple theft:బాసర ఆలయం దొంగల అరెస్టు ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, పట్టీలు దొంగిలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు నిఘా పెంచి దర్యాప్తు వేగవంతం చేయడంతో నిందితులు చిక్కారు. ఎట్టకేలకు దొంగలను గుర్తించి కటకటాల్లోకి పంపడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Read also: Langer Houz Women Death:లంగర్‌హౌస్ హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

 Arrest of Basara temple thieves

ఆలయంలో చోరీ ఎలా జరిగింది

గత నెల 22న దొంగలు ఆలయంలోకి ప్రవేశించి వెండి వస్తువులను అపహరించారు. గుంటూరు జిల్లాకు చెందిన పల్లాపు ఎడకొండ, నిజామాబాద్ జిల్లాకు చెందిన కిరణ్, మహారాష్ట్ర వ్యక్తి ఆనంద్ కలిసి ఈ ప్లాన్ అమలు చేశారు. వీరు అంతకుముందు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మరో కేసు కోసం నిజామాబాద్ వచ్చిన సమయంలోనే బాసరను లక్ష్యంగా చేసుకున్నారు.

Basara temple theft:పోలీసుల చాకచక్యం

దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నాందేడ్ వెళ్లాలని నిందితులు నిర్ణయించుకున్నారు. బాసర రైల్వే స్టేషన్ వద్ద వీరు ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానితులను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Epaper: epaper.vaartha.com

సాయికృష్ణ కేసులో ట్విస్ట్: నేను నిర్దోషిని.. నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టుకు సీఐ నాగరాజు లేఖ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha