Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బావమరిదిని చంపి శవంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన వ్యక్తి

బావమరిదిని చంపి శవంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన వ్యక్తి

వార్త 3 months ago

Bangalore Crime: నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన బంధుత్వమే ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. వావివరుసలు మరచి ప్రవర్తించిన తీరు ఒకరిని హంతకుడిగా మార్చగా, మరొకరిని శవంగా మార్చింది.

బెంగళూరులోని బన్నేరుగట్ట ప్రాంతంలో జరిగిన ఈ భయంకరమైన హత్యోదంతం ఇప్పుడు నగరం అంతటా చర్చనీయాంశంగా మారింది. అక్రమ సంబంధం కారణంగా తలెత్తిన ఘర్షణ చివరకు రక్తపాతంతో ముగిసింది.

బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ భైరప్పనహళ్లిలో కుక్కల పెంపక కేంద్రం నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్ తన బావమరిది రంజిత్ (24)ను తన సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. రంజిత్ స్వయానా శ్రీనివాస్ భార్య తమ్ముడు కావడంతో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే, ఈ స్నేహం మాటున రంజిత్ చేస్తున్న ఒక పని శ్రీనివాస్ జీవితంలో చిచ్చు పెట్టింది. శ్రీనివాస్ చెల్లెలితో రంజిత్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం బయటపడటంతో వివాదం మొదలైంది.

Read Also : Hawaii Helicopter Crash:హవాయిలో హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి

 Man kills brother-in-law surrenders with body

Bangalore Crime: హెచ్చరించినా మారని తీరు – చర్చల సాకుతో హత్య

తన చెల్లెలితో రంజిత్ ప్రవర్తిస్తున్న తీరుపై శ్రీనివాస్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇది ధర్మం కాదు.. కుటుంబ గౌరవాన్ని కాపాడు” అని పెద్ద మనుషులతో చెప్పించినా రంజిత్‌లో మార్పు రాలేదు. పైగా శ్రీనివాస్‌నే రెచ్చగొట్టేలా ప్రవర్తించసాగాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్, దీనికి శాశ్వత ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. చర్చల పేరుతో రంజిత్‌ను బన్నేరుగట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి, అక్కడ జరిగిన వాగ్వాదంలో వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో రంజిత్ తలపై బలంగా బాదాడు. ఆ దెబ్బకు రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

శవంతో పోలీస్ స్టేషన్‌కు..

హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ ఎక్కడికీ పారిపోలేదు. రంజిత్ మృతదేహాన్ని తన వాహనంలో వేసుకుని నేరుగా బన్నేరుగట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్ ముందు కారు ఆపి, లోపలికి వెళ్లి పోలీసులతో “నేనే నా బావమరిదిని చంపేశాను.. బాడీ కారులో ఉంది, నన్ను అరెస్ట్ చేయండి” అని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాహనాన్ని తనిఖీ చేయగా రక్తపు మడుగులో ఉన్న రంజిత్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముగిసిన డీఎన్ఏ పరీక్షలు.. స్వగ్రామాలకు మృతదేహాలు తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha