Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

వార్త 2 weeks ago

Karimnagar RTC Bus: ఈ ప్రమాదం గురించి తెలిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి.. ఏకంగా రోడ్డు పక్కనే ఉన్న భారీ వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.

కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ బస్సు పూర్తిగా బావిలోకి పడిపోలేదు. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని కొంత భాగం బావి అంచునే ఆగిపోయింది. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగి సురక్షితంగా బయటపడ్డారు.

Read Also : Congress 1000 Rojula Palana : 1,000 రోజుల పాలన పై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

 RTC bus hurtles towards a well… disaster narrowly averted!

Karimnagar RTC Bus: స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు

బాధిత ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సు కరీంనగర్ డిపో నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారుకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిపైకి వేగంగా దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.సమయానికి బస్సు బావికి ఉన్న కట్టెలు/గోడ, పైభాగాన్ని తాకి ఆగిపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను బస్సు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారికి సమీపంలో ప్రాథమిక చికిత్స అందించారు.

ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha