Dailyhunt
Balakrishna: అఖండ2: OTT డేట్ కన్ఫర్మ్

Balakrishna: అఖండ2: OTT డేట్ కన్ఫర్మ్

వార్త 3 months ago

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thaandavam) డిసెంబర్‌లో విడుదలై అభిమానులను అలరించింది.

బాలకృష్ణ అఘోర నటన, బోయపాటి సీరియస్ డైరెక్షన్, సనాతన ధర్మంపై ప్రధానంగా దృష్టి పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.

సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది. (Balakrishna) సంక్రాంతి ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికపై జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన, ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Temple Donations: నూతన సంవత్సర వేళ ఆలయాల్లో కానుకల వెల్లువ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha