కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన లీగల్ కేసు అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. బండి భగీరథ్ ఎక్కడికీ పారిపోలేదని, చట్టప్రకారమే వ్యవహరించాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రాంచందర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఏ వ్యక్తిపైన అయినా లీగల్‌గా కేసు నమోదైనప్పుడు, వారు చట్టప్రకారం ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉంటుందని రాంచందర్‌రావు గుర్తుచేశారు. భగీరథ్ కూడా చట్టాన్ని గౌరవిస్తూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడని తెలిపారు.
Read Also: Twisha Sharma death case: ట్విషాశర్మ మృతి కేసులో సీసీటీవీ ట్విస్ట్.. అసలేం జరిగింది?
Ramchandra Rao
అయితే కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకపోవడంతోనే, ఆయన చట్టానికి లోబడి కోర్టులో సరెండర్ అయ్యాడని, అంతేకానీ పారిపోయాడనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు.
BJP state president: కేంద్ర మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం
బెయిల్ పొందడం అనేది చట్టంలో ఉన్న ప్రాథమిక హక్కు అని పేర్కొన్న రాంచందర్‌రావు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వెనకేసుకొచ్చారు. బీజేపీ ప్రతిష్టను మసకబార్చడానికే (బద్నాం చేయడానికి) ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని పెద్దదిగా చూపిస్తున్నాయని రాంచందర్‌రావు ఆరోపించారు. భగీరథ్ అంశానికి సంబంధించిన చట్టపరమైన నిజానిజాలను కోర్టులే తేలుస్తాయని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు ఉంటాయని, దానికి చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
టీ తాగుదామని పిలిచి బీటెక్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం!

