Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ పరారీ: హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు, విచారణకు గైర్హాజరు

బండి భగీరథ్ పరారీ: హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు, విచారణకు గైర్హాజరు

వార్త 1 week ago

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం కలకలం రేపింది.

హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి ఫ్లైఓవర్, నలగండ్ల ఫ్లైఓవర్ మరియు మున్సిపల్ జోనల్ కార్యాలయాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. “మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బండి భగీరథ్ పరారీ” అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: PM Modi Cabinet Decisions: రైతులకు తీపి కబురు.. ఖరీఫ్ మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదం

 Bandi Bhagirath

Bandi Bhagirath: విచారణకు రాకపోవడంతో పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి

మంగళవారం పోలీసులు జారీ చేసిన నోటీసుల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భగీరథ్ పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆయన విచారణకు రాకపోవడంతో పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.
భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించాయి. మెట్రో రైళ్లలో కూడా కొందరు పోస్టర్లను ప్రదర్శిస్తూ నిందితుడిని రిమాండ్‌కు తరలించాలని కోరడం గమనార్హం. 17 ఏళ్ల మైనర్ బాలికను వేధిస్తున్నాడన్న ఫిర్యాదుతో గత శుక్రవారం భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్లను కూడా జోడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha