Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు!

బండి భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు!

వార్త 3 months ago

Bandi Bhagirath case: మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను తీవ్రం చేశారు. అతను దేశం దాటిపోకుండా ఉండేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Read Also: Director of Excise Department: అక్రమ మద్యం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై ఉక్కు పాదం: అవినాష్ మొహంతి

 Lookout notices for Bandi Bhagirath!

Bandi Bhagirath case: మంత్రి నివాసంలో పోలీసు బృందాల తనిఖీలు

భగీరథ్ జాడ కనిపెట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ నివాసం లో పోలీసు బృందం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. భగీరథ్‌తో టచ్ లో ఉన్నవారి వివరాలను, కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా, అతని స్నేహితులు, బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం అందుతోంది.

నిన్న కోర్టులో సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ దశలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha