Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!

Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!

వార్త 4 months ago

Bandi Sanjay Kumar : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ఈ రెండు పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ATMగా మార్చేశాయని విమర్శించారు.

దశాబ్దకాలంగా జరిగిన దోపిడీ కారణంగా సింగరేణి రూ.42 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2014 నుంచి సింగరేణిలో భారీ అవకతవకలు జరిగాయని, K. Chandrashekar Rao కుటుంబం సంస్థను దోచుకుందని బండి సంజయ్ ఆరోపించారు. అవకతవకలకు సంబంధించిన కీలక రికార్డులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆలస్యం జరిగితే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింగరేణిపై విచారణ జరపాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Kumar) చేసిన సంజయ్, ఈ వ్యవహారం విచారణలా కాకుండా టీవీ సీరియల్‌లా మారిందని ఎద్దేవా చేశారు. ట్యాపింగ్ జరగలేదని కేసీఆర్ కుటుంబం దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగా ఈ అరాచకాలు జరిగాయని, తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.

సింగరేణి ఆస్తులపై వాలుతున్న రాబందుల నుంచి సంస్థను కాపాడతామని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తామని, దోపిడీకి పాల్పడ్డ వారిని బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

India vs New Zealand T20 :టీమ్ ఇండియా ఘన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha