Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండ్లగూడ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు

బండ్లగూడ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు

వార్త 3 weeks ago

Bandlaguda Traffic:బండ్లగూడ చౌరస్తా ట్రాఫిక్ జామ్ సమస్య రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తీవ్ర రూపం దాల్చింది. ఉదయం సమయంలో బండ్లగూడ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరలేక తీవ్ర ఆలస్యం అవుతోందని వాపోతున్నారు.

Hyderabad Crime: కేబుల్ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకి.. టెకీ బలవన్మరణం

 Traffic woes at Bandlaguda crossroads

బండ్లగూడ చౌరస్తా వద్ద రాంగ్ రూట్ ప్రయాణాలు

బండ్లగూడ చౌరస్తా వద్ద వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. కొందరు వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పీక్ అవర్స్ లో అధిక వాహనాల రాకపోకలు ఉండటం, రోడ్డు పనులు జరుగుతుండటంతో తరచూ ఈ ప్రాంతంలో భారీ జామ్ ఏర్పడుతోంది.

Bandlaguda Traffic:చాంద్రాయణగుట్ట రూట్ లో తీవ్ర ఇబ్బందులు

ముఖ్యంగా బండ్లగూడ నుంచి చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. బండ్లగూడ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెంచడంతో పాటు రాంగ్ రూట్లో వెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

మెట్రో పక్కనే భూములా? ఇక పండగే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha