Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వార్త 1 week ago

AP Rain Alert Today: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, ఉత్తర తమిళనాడు, రాయలసీమ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

Read Also:Southwest: రైతులకు గుడ్ న్యూస్.. ముందుగానే 'నైరుతి'

AP Rain Alert Today: నేడు వర్షాలు కురిసే జిల్లాలు ఇవే (మే 15):

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఈ కింది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది:

 AP Weather Update

  • అల్లూరి సీతారామరాజు జిల్లా
  • పోలవరం పరిసర ప్రాంతాలు
  • కర్నూలు & నంద్యాల
  • అనంతపురం & శ్రీ సత్యసాయి జిల్లా
  • వైఎస్ఆర్ కడప

ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పోలవరం నిర్వాసితులకు తీపి కబురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha